![]() |
![]() |
.webp)
అంబానీ ఇంట పెళ్లి రోజూ ఎదో ఒక అంశంలో టాప్ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఎందుకంటే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి మాములుగా జరిగిందా మరి. రెండు ప్రీవెడ్డింగ్ షూట్లు, అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ ని పిలవడాలు, వాళ్లకు గిఫ్టులు...అబ్బూ ఆ హడావిడి మాములుగా లేదు. 5 వేల కోట్ల రూపాయల ఖరీదైన పెళ్లి మరి. ఇన్ని కోట్ల పెళ్లి అంటే మరి భారీగానే అప్పులయ్యి ఉంటాయి కదా..పెళ్ళికి ముందే జియో చార్జెస్ పెంచడంతో ఈ రెండు అంశాలను లింక్ పెట్టి మరీ అంబానీ ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు జనాలు, నెటిజన్లు. ఇప్పుడు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి కూడా ఫుల్ గా కామెంట్ చేస్తూ ఒక రీల్ ని రిలీజ్ చేసింది.
"మొత్తానికి పెళ్లి చేసేశాం. వధూవరులు ఎంత ముద్దుగా ఉన్నారో. ఐనా కానీ అంబానీకి గారికి ఎంతో అప్పు మిగిలి ఉండి ఉంటుంది. ఎం చేస్తాం వెంకటేశ్వర స్వామికె అప్పుల బాధ తప్పలేదు. ఇక అంబానీగారెంతా. మీరంతా రెడీగా ఉండండి. వచ్చే నెల నుంచి మ్యారేజ్ ఈఎంఐ కట్టడానికి" అంటూ అద్భుతమైన సెటైర్ వేసింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా స్పందించడం లేదు. "మేడం ఇది అంబానీ ఫ్యామిలీ చూశారంటే చచ్చిపోతారేమో మేడం... మీకు జియో చార్జెస్ పెంపుపై బాగా మండినట్టుంది. ఎందుకు మేడం మీరు నిజాలు మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఊరకనే అంటారా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అందుకే పెళ్లికి డబ్బులు లేక మన దగ్గర నుంచి తీసుకొని పెళ్లి చేస్తున్నారు వాళ్ళు.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |